సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: విశాఖపట్టణంలో డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు నిర్వహించే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెరిక శ్రీకాంత్ పిలుపునిచ్చా రు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, పాత చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజు, ఆసిఫా బాద్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి తోట సమ్మయ్య, సభ్యులు నాగేశ్, జగ్గారావ్, దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


