ఎన్నికల సామగ్రి తరలింపు
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలంలో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రిని సోమవారం రాత్రి పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌లో తరలించారు. 28 పంచాయతీలకు సంబంధించిన సామగ్రిని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల అధికారులు డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌కు వచ్చి సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. సామగ్రి తరలింపు ప్రక్రియను ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్, ఎంపీవో గౌరీశంకర్ పర్యవేక్షించారు.


