సాహు మహరాజ్‌కు నివాళి
వాంకిడి: రిజర్వేషన్ పితామహుడు, కోల్హాపూ ర్ సంస్థాన మొదటి మహరాజు సాహు మహరాజ్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారాలో సోమవారం నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పంచశీలలు ఆలపించా రు. అనంతరం బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశో క్ మహోల్కర్, మండల గౌరవాధ్యక్షుడు ఉప్రె జైరాం, ఎస్‌ఎస్‌డీ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్ మాట్లాడుతూ.. బీఆర్ అంబేడ్కర్ ఉన్నత విద్యకు సాహు మహరాజ్ ఆర్థికసాయాన్ని అందించారని గుర్తు చేశారు. నా యకులు శ్యామ్‌రావు, ప్రతాప్, రమేశ్, వివేక్, సురేశ్, నూతన్ తదితరులు పాల్గొన్నారు.


