టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ధర్నా
కౌటాల(సిర్పూర్): డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె.రాజేందర్ మాట్లాడుతూ కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా రూ.10వేలు ఇవ్వాలని ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వమని చెప్పడంతో విద్యార్థులను రెచ్చగొట్టి ఇటీవల రోడ్డుపై ధర్నా చేయించడని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు. నాయకులు వెలిశాల కృష్ణమాచారి, కె.శారద, పి.మాయ పాల్గొన్నారు.


