సమస్యలపై సమీక్ష నిర్వహించాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్‌వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లేదు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్‌పోర్టు భూ సేకరణకు జీవో జారీ, ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్


