భూ సేకరణకు నిధులివ్వండి
కొరటా– చనాఖా ప్రాజెక్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. అలాగే పంటచేలకు రోడ్లు వేసేలా పొలంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూపుతూ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్


