బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా బాల్యవివాహాలను అరికట్టేందుకు బాల్య వివాహ ముక్త్– 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి నట్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ తెలి పారు. జిల్లా కేంద్రంలోని మహిళాశిశు సంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం అవగా హన పోస్టర్లు ఆవిష్కరించారు. నవంబర్ 27 నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మార్చి 8 వరకు కొనసాగుతాయని తెలిపారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు వంటి ప్రార్థనాస్థలాల వద్ద అవగాహన బోర్డులు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్ మాట్లాడుతూ షూర్ స్వచ్ఛంద సంస్థ, బాలల సంరక్షణ విభాగం సమన్వయంతో బాల్య వివాహాల నిర్మూలనకు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాలరక్ష భవన్ సిబ్బంది శ్రావణ్, నవీన్‌కుమార్, బాల ప్రవీణ్, వెంకటేశ్వర్లు, షూర్ సంస్థ కోఆర్డినేటర్ సంతోష్‌కుమార్, దేవాణి, ప్రభు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


