భక్తిశ్రద్ధలతో దత్త జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సాయి మంది రంలో గురువారం దత్త జయంతి భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అర్చకులు మధుకర శ ర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో ఉదయం సాయినాథుడు, దత్తాత్రేయ, గణపతి విగ్రహాలకు పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న సా మూహిక గురుచరిత్ర పారాయణం ముగింపు సందర్భంగా గురుచరిత్ర పుస్తక పూజ నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకొన్నారు. మధ్యా హ్న హారతికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తాటిపెల్లి రమేశ్, రావుల దిలీప్, గంధం వినోద్, నాందేవ్, చెన్నూరి ప్రకాశ్, నాగోరావు తదితరులు పాల్గొన్నారు.


