నిధులు పీవీటీజీలకే చెందాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పీఎం జన్‌మన్ నిధులు 100శాతం పీవీటీజీలకు చెందాలని సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మాన్కు కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పీవీ టీజీలకు విడతలవారీగా కాకుండా ఒకేసారి ఇళ్లు మంజూరు చేసి వాటి నిర్మాణ బాధ్యతల ను ఐటీడీఏకు అప్పగించాలని కోరారు. కొ లాం, తోటి తెగలకు చెందిన పీవీటీజీల కో సం మొదటి విడతలో మంజూరైన 2,150 ఇళ్లలో కొన్నింటిని ఇతరులకు అధికారులు కేటా యించారని ఆరోపించారు. వాటిని తక్షణమే రద్దు చేసి అర్హులకు మంజూరు చేయాలని డి మాండ్ చేశారు. నాయకులు గోవింద్‌రావ్, అ న్నిగా, జలపతి, రాజు, సోనేరావ్, తిరుపతి, భీంరావ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


