కరపత్రం ఆవిష్కరణ
కాగజ్‌నగర్ టౌన్: ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించనున్న సీఐటీయూ ద్వితీయ మహాసభల ప్రచార కరపత్రాన్ని కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీ నివాస్ మాట్లాడారు. మహాసభలకు రాష్ట్ర న లుమూలల నుంచి అధికసంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు సంజీవ్, అరుణ, మల్లేశ్వరి, రాణి, వినోద, తిరుపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


