
బీసీ సంఘాలు ఏకతాటిపైకి రావాలి
ఆసిఫాబాద్‌అర్బన్: హక్కుల సాధనకు బీసీలు ఏకతాటిపైకి రావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు పోరాడాలని కోరారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించే బీసీ జేఏసీ ఏర్పాటు సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, నాయకులు బాల్దారపు మధుకర్, కమలాకర్ పాల్గొన్నారు.