
క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని బెల్లంపల్లి ఏరియా ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్ అన్నారు. డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా సోమవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నియర్ బై వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతర సాధనతో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ అశోక్, కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, పీఈటీ భాస్కర్ పాల్గొన్నారు.