
నిబంధనలు పాటించకుంటే చర్యలు
కాగజ్‌నగర్‌టౌన్: తూకాల్లో నిబంధనలు పాటించకపోతే వ్యాపారులపై చర్యలు తప్పవని తూనికలు, కొలతల శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి హెచ్చరించారు. సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలోని బంగారు దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, ఇతర దుకాణలను తనిఖీ చేశారు. వ్యాపారులు వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు, రాళ్లు ఉపయోగించే కాంటాలకు గడువు తీరిన తర్వాత సీలు వేయించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా తప్పుడు తూకాలతో మోసాల కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. విని యోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది సుందర్‌రావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.