
జోనల్‌స్థాయి పోటీలకు 12 మంది ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో సోమవారం ఎస్ జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ అండర్–17 జిల్లాస్థాయి బాలుర వాలీబాల్ పోటీలకు 60 మంది క్రీడాకారులు హాజరుకాగా, 12 మంది జోనల్‌స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 14న నిర్మల్ జిల్లాలో జోనల్‌స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కర్నూ, పీడీ, పీఈటీలు మీనారెడ్డి, రాజయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, సుభాశ్, రాకేశ్, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.