
‘పార్టీ బలోపేతానికి కృషి’
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రూపు విభేదాలు నివారించే దిశగా డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీసీ పరిశీలకుడు నరేశ్‌కుమార్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆ దివారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్, కాగజ్‌నగర్‌లోని రన్ ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. సాయంత్రం ఆసిఫాబాద్ అ టవీశాఖ అతిథిగృహంలో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం అన్నివర్గాలతో సమావేశమవుతామని తెలిపారు. గ్రూపు తగాదా లు నివారించే ప్రయత్నం చేస్తామన్నారు. అధ్యక్ష పదవికి ఇప్పటివరకు 25కు పైగా నామినేషన్లు వచ్చాయని, ఇందులో ఆరు నామినేషన్లను కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని జనశక్తి ఆర్గనైజేషన్‌కు అందించామని తెలిపారు. అహ్మదాబాద్ సమావేశంలో జిల్లా అధ్యక్షుల ఎన్నిక చేపడతామని పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, కోఆర్టినేటర్ శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.