
సమావేశం సక్సెస్ చేయాలి
రెబ్బెన: కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో ఈనెల 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ శ్రామిక మహిళా ఐదో రాష్ట్ర కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి శ్రామిక మహిళా ఉద్యమ నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మ హిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూ పొందిస్తారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5న ఉదయం 11గంటలకు ఎస్పీఎం గ్రౌండ్ నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వర కు భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలా ల నుంచి అధికసంఖ్యలో శ్రామిక మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యుడు చాపిడి శివ, గ్రామకార్యదర్శి డోంగ్రి గజానంద్ పాల్గొన్నారు.