
‘పాలఘోరీ’పై ప్రత్యేక నిఘా
జన్నారం: అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పాలఘోరీ ఘటన మళ్లీ పు నరావృత్తం కాకుండా ఉండేందుకు ఆశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి స మస్య ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యా రు. ఏ క్షణంలోనైనా ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకునే అవకాశం ఉండడంతో అటవీశాఖ అధికా రులు అదే ప్రాంతంలో తిష్ట వేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
గుడిసెలు తొలగింపు
జన్నారం అటవీ డివిజన్, ఇందన్‌పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ పాలఘోరీ ప్రాంతంలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు వందమంది ఆదివాసీ గిరిజనులు ఆగస్టు 4న ఈ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. అట వీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు వారికి ప లుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కానీ, వారు వెళ్లకపోగా సెప్టెంబ ర్ 18న రాత్రి సుమారు 350 టేకుచెట్లను నరికారు. అడ్డుగా వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో 26 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సహాయంతో అడవిలో వేసుకున్న గుడిసెలను తొలగించారు.
ప్రత్యేక నిఘా
గుడిసెలు తొలగించిన తర్వాత మళ్లీ ఎప్పుడైనా ఆదివాసీ గిరిజనులు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చే అ వకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశి ష్ సింగ్ పది రోజులపాటు అక్కడే ఉండాలని టా స్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ ఇందన్‌పల్లి, జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్‌లలోని సిబ్బందికి రోజువారీగా డ్యూటీలు వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టీం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరో టీం, సాయంత్రం 7గంటల నుంచి తెల్లవారుజాము వరకు మరో టీంను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. వీరితో పాటుగా ఇందన్‌పల్లి రేంజ్ అధికారి శ్రీకాంతచారి, టాస్క్ ఫోర్స్ రేంజ్ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా పాలఘోరీ ప్రాంతంలోని అటవీ సిబ్బందిలో మార్పులు చేశారు. డీఆర్వో, సెక్షన్ అధికారి, బీట్ అధికారులను నూతనంగా నియమించారు. ఇక్కడి బేస్‌క్యాంపు సిబ్బందిని మరోచోటకు పంపించి కొత్తవారిని నియమించారు. విధుల్లో చిన్న నిర్లక్ష్యం ప్రదర్శించినా వేటు తప్పదని సంకేతాలు ఇవ్వడంతో కిందిస్థాయి సిబ్బంది భయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
కందకాల తవ్వకం
పాలఘోరీ ప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురి కావడాన్ని సీరియస్‌గా తీసుకున్న అట వీ అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో చుట్టూ కందకాలను తవ్వించారు. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను సిబ్బందికి అప్పగించారు. అయితే టైగర్‌జోన్ సర్కిల్, జిల్లా అటవీశాఖ, జన్నారం డివిజన్ శాఖ నుంచి పాలఘోరీపై నిఘా ఉన్నట్లు తెలుస్తోంది.
నిఘా ఉంచాం
పాలఘోరీ ప్రాంతంలో కొందరు ఆదివాసీ గిరిజనులు అక్రమంగా వేసుకున్న గుడిసెలు తొలగించాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాం. సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశాం. అటవీ భూమిలో అక్రమంగా గుడిసెలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో, జన్నారం

‘పాలఘోరీ’పై ప్రత్యేక నిఘా