బర్రెలు సేద తీరుతున్న ఈ ప్రాంతం నీటిగుంట అనుకుంటే పొరపాటే. ఇది అడ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువకు ఉప కాలు వ. కొన్నేళ్ల క్రితం సిమెంట్ లైనింగ్ కొట్టుకుపో యి ఇలా తయారైంది. సామేలా, కోమటిగూడ, దుబ్బగూడ, కనర్‌గాం గ్రామాల మీ దుగా ఆసిఫాబాద్ మండలంలోని గుండా వరకు విస్తరించిన దీనికి పలు పిల్ల కాలువలు న్నాయి. పలుచోట్ల కాలువకు గండ్లు పడి అటు వైపు ఆయకట్టుకు నీరు అందడం లేదు.
ఇది 39,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన అడ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువ. ఇటీవల కురిసిన వర్షాలకు చిన్నవాంకిడి సమీపంలో భారీ గండి పడి నీరు వాగులో కలుస్తోంది. దీంతో దిగువ ప్రాంతంలో నీటిబొట్టూ లేకుండా ఎండిపోయింది. ఏళ్లుగా కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయి పిచ్చి మొక్కలు, పూడికతో నిండి అధ్వానంగా, కళావిహీనంగా మారింది.
వాంకిడి: సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయి పిచ్చి మొక్కలు, తుంగ, చెత్తాచెదారం, పూడికతో నిండిన అడ (కుమురంభీం) ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలు వ అధ్వానంగా మారింది. అధికారుల నిర్వహణ లోపంతో సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. అడపాదడప చేపడుతున్న నాణ్యతలేని మరమ్మతు పనులతో తరచూ కాలువ తెగిపోతోంది. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతు లు ఇబ్బంది పడుతున్నారు. కాలువకు సమీపంలోని పొలాలకూ చుక్క నీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలో సాగునీటికి ప్రధాన వనరుగా ఉన్నా ఈ ఎడమ కాలువ నిర్వహణ లోపంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.
39,500 ఎకరాల ఆయకట్టు
అడ ప్రాజెక్ట్‌ను 2011లో ప్రారంభించగా ప్రధాన ఎడమ కాలువను వాంకిడి మండలం గుండా నిర్మించారు. 65కిలోమీటర్ల ఈ కాలువ 39,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇది వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్‌పూర్(టీ) మండలాల మీదుగా విస్తరించి ఉంది. అనేక ఉప, పిల్ల కాలువతో సాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కొన్ని పిల్ల కాలువలకు నీటి సరఫ రా కూడా ప్రారంభించ లేదు. కట్టలు తెగిపోవడం, గండ్లు పడటం లాంటి అవాంతరాలు ఏర్పడిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం సాగునీరు ఒర్రెలు, వాగుల్లో కలిసిపోతున్న పరిస్థితి నెలకొంది.
నామమాత్రంగా ఆరుతడి పంటలు
ఎడమ కాలువ నిర్వహణ సరిగా లేక వరి, కూరగాయలు లాంటి పంటల సాగు నామమాత్రంగానే ఉంది. వర్షాధారంపై సాగుచేసే పత్తి పంటకు చలి కాలం చివరలో సాగునీటి అవసరముంటుంది. రై తులు ఏటా ఈ కాలువకు ఆయిల్ ఇంజన్లు పెట్టి తడులు అందించేవారు. కానీ, కాలువ బండ్ తెగిపోగా ఈసారి ఆ పరిస్థితి లేదు. బండ్‌కు మరమ్మతు చేపట్టిన తర్వాత కూడా అధిక మొత్తంలో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా అధిక మొత్తంలో నీరు విడుదల చేస్తే కాలువ మళ్లీ కోతకు గురయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పటికీ వర్షాలు తగ్గు ముఖం పడితే గాని ప నులు ప్రారంభించలేమని అధికారులు చెబుతున్నా రు. దీంతో పత్తికి నీటి తడులు అందించడం కష్టమే. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు పత్తి రైతు చిత్తవుతుండగా, చివరలో నీటి తడులు అందించలేని పరిస్థితుల్లో మరింత నష్టపోయే ప్రమాదముంది.
మరమ్మతులు చేపట్టాలి
ఇటీవల కురిసిన వర్షాలకు మా గ్రామ శివారులోని ప్రధాన కాలువ తెగగా నీటి సరఫరా నిలిపేశారు. త్వరగా మరమ్మతు చేపట్టి సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలి. నా పొలం పక్క నుంచే పిల్ల కాలువ ఉన్నా ఇప్పటివరకు నీరు రాలేదు. నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటే చాలావరకు ఖర్చు తగ్గుతుంది.
– వడ్గురె భూషణ్, రైతు, చిన్నవాంకిడి
త్వరగా పనులు చేపట్టాలి
చలికాలం చివరలో పత్తి పంటకు నీటి తడులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కాలువనీరే ఆధారం. ప్రస్తుతం కాలువ తెగిపోయి ఉండగా సాగునీరు అందుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. అధికారులు కాలువను పరిశీలించి వర్షాలు తగ్గుముఖం పట్టాక మరమ్మతులు చేపడతామన్నారు. త్వరగా పనులు చేపట్టాలి.
– వడ్గురె పాపాలాల్, రైతు, చిన్నవాంకిడి
చిన్నవాంకిడి వద్ద తెగిన బండ్
ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదతో చిన్నవాంకిడి శివారులో ఎడమ కాలువ బండ్ తెగింది. దీంతో కాలువకు నీటి సరఫరా నిలి పివేశారు. మూడేళ్ల క్రితం వరద ధాటికి అదే ప్రాంతంలో బండ్ తెగిపోగా మరమ్మతు చే యించారు. కానీ, నాణ్యత లేమితో పనులు మూడేళ్లూ నిలవలేక పోయాయి. చిక్లీ వాగు పైనుంచి కాలువ నిర్మించగా తరచూ బండ్ తెగిపోతోంది. దీనిపై ప్రాజెక్ట్ డీఈ దామోదర్‌ను వివరణ కోరగా.. బండ్ మరమ్మతుకు రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వ ర్షాలు తగ్గుముఖం పట్టాక పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అయితే మరమ్మతులు చేపడితేనే గాని ఈ కాలువ గుండా నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉంది.
కాలువల ఆనవాళ్లేవి?
కాలువల ఆనవాళ్లేవి?
కాలువల ఆనవాళ్లేవి?
కాలువల ఆనవాళ్లేవి?