
నాసిరకం మందులు విక్రయిస్తే చర్యలు
రెబ్బెన: ఫర్టిలైజర్ షాపుల్లో నాసిరకం మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాఽధికారి వెంకట్ హెచ్చరించారు. శని వారం మండల కేంద్రంతోపాటు నారాయణపూర్‌లోని ఫర్టిలైజర్ షాపులు, నారాయణపూర్ రైతువేదికలో యూరియా పంపిణీని తనిఖీ చేశారు. షాపుల్లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో ప్రభుత్వ ధరలకే ఎరువులు విక్రయించాలని సూచించారు. రై తులకు నకిలీ, నాసిరకం మందులు అంటగట్టినా, అధికధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనా లు, ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు తప్పనిసరిగా రశీదులు పొందాలని సూ చించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా అవుతోందని, మోతాదుకు మించి వాడి తే భూసారం దెబ్బతింటుందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సా రించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఆయన వెంట ఏవో దిలీప్, ఏఈవోలు రాకేశ్, సంజీవ్, శివ తదితరులున్నారు.