
మరిచారా?
అసౌకర్యాలకు నిలయం జోడేఘాట్!
భీం మ్యూజియం అభివృద్ధి జాడేది?
ఎండిపోతున్న హరితవనం మొక్కలు
నీటి మూటలైన పాలకుల హామీలు
రణభూమిని
కెరమెరి: చరిత్ర పుటల్లోకెక్కిన ఆదివాసీ వీరుడు కు మురంభీం జల్.. జంగల్.. జమీన్.. కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రాంతమైన జోడేఘాట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. భీం వర్ధంతి సమీపిస్తుండడంతో సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, గడ్‌చందూర్ తదితర ప్రాంతాలకు చెందిన ఇక్కడికి వస్తున్నారు. అయితే.. సందర్శకులకు ఇక్కడా తాగునీరు కూడా లభించని దుస్థితి ఉంది. ఒక్కగానొక్క బోరు ఉండగా అది గ్రామస్తుల తాగునీటి అవసరాలకు సరిపోతోంది. దీంతో కనీస సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.
నెరవేరని కేసీఆర్ హామీ
2014లో నిర్వహించిన భీం వర్ధంతి సభలో అప్పటి సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో రూ.25కోట్లతో కుము రం భీం విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యకు తగినట్లు కాటేజీలు, హోటళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. పదకొండేళ్లయినా నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి జోడేఘాట్ అభివృద్ధిని విస్మరించారనే ఆరోపణలున్నాయి.
కాంగ్రెస్ సర్కారుదీ అదే తీరు
అప్పటి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్ర స్తుత ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జోడేఘాట్‌లో రూ.4.96 కోట్లతో టూరిజం అభివృద్ధి పనులకు ఈ ఏడాది జనవరి 13న శంకుస్థాపన చేశారు. మ్యూజియం వెనుక భాగంలోని స్థలంలో కాటేజీ లు, హోటళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. తొ మ్మిది నెలలైనా నేటికీ పనులు ప్రారంభించలేదు. 12 పోరు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి.
పనులు ప్రారంభించాలి
పాలకులు జోడేఘాట్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మించాలి. ఐటీడీఏ ఆధ్వర్యంలో హోటళ్లు ఏర్పాటు చేయాలి. ఎండిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలు నాటించాలి. మొక్కల సంరక్షణకు నీటి సౌకర్యం కల్పించి ఓ కూలీని నియమించాలి. పాలకులు, అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలి.
– పెందోర్ రాజేశ్వర్, పోరు గ్రామాల అధ్యక్షుడు
‘కుమురం భీం
మ్యూజియం నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశాం. ఇతర
ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి కోసం కాటేజీలు, మంచి హోటల్ నిర్మిస్తాం. భవిష్యత్‌లో జోడేఘాట్ చారిత్రక ప్రదేశంగా మారుతుంది. పర్యాటకుల తాకిడి కూడా బాగా
పెరుగుతుంది’
– 7.10.2014న
భీం వర్ధంతి సభలో అప్పటి సీఎం కేసీఆర్ అన్న మాటలివి.

మరిచారా?

మరిచారా?