
ఎండిపోయిన మొక్కలు
గతంలో హరితవనంలో భాగంగా మ్యూజియం వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో టూరిజం, అటవీశాఖ అధికారులు సుమారు 29వేల మొక్కలు నాటారు. మనిషి ఆకృతిని నిర్మించి అవయవాల వద్ద 100రకాల ఔషధ మొక్కలు నాటి వది లేశారు. ఏ అవయవానికి అవసరమయ్యే మొక్కలను వాటి వద్దే నాటగా అవి నీరు లేక ఎండిపోయాయి. ప్రస్తుతం లోటస్‌పాండ్‌లోని మనిషి ఆకృతిలో ఔషధ మొక్కల స్థానంలో పిచ్చి మొ క్కలు దర్శనమిస్తున్నాయి. గతేడాది ఉపాధిహా మీ పథకంలో నాటిన కొన్ని మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. హరితవనంలో భాగంగా నాటి న సుమారు 29వేల మొక్కల్లో ప్రస్తుతం రెండువేల మొక్కలు కూడా కనిపించడం లేదు.