
విద్యార్థులకు అవగాహన
ఆసిఫాబాద్‌రూరల్: వృత్తివిద్య కోర్సులో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, డిజిటల్ ఫొటో స్టూడియోను సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సెలవులో వృత్తివిద్య కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్‌లో భాగంగా ప్రత్యక్షంగా ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ శిక్షణ జీవితంలో సొంతంగా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనర్ రాజు, సులోచన పాల్గొన్నారు.