
‘కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆత్మగౌరవం, సమానత్వమే లక్ష్యంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. కేవీపీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న కేవీపీఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. అనేక ఉద్యమాలు, పోరాటాలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పవన్, మల్లేశ్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తదతరులు పాల్గొన్నారు.