
చెడుపై మంచి సాధించిన విజయం
త్రిశూల్ పహాడ్‌పై రావణాసురుని ప్రతిమ
ఆసిఫాబాద్‌అర్బన్: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటామని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి బుధవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మంచిమార్గాన్ని ఎంచుకుని జీవితంలో పైకిరావాలని, సమాజబాగు కోసం పాటుపడాలని సూచించారు. సన్మార్గంలో నడిచిన వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో ముందుండాలన్నారు.
ఆసిఫాబాద్: విజయానికి ప్రతీకగా నిలిచే దసరా ఉత్సవాలను గురువారం వైభవంగా జరుపుకునేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు మార్కండేయ స్వామి ఆలయ సమీపంలో, అనంతరం కేస్లాపూర్ హన్మాన్ ఆలయంలో షమీపూజ నిర్వహించనున్నారు. అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భూమి చదును చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టం, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జవర్దస్త్ కళాకారులు అన్వేశ్, గౌరీష్, సింగర్ భవానిచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం సాయి ఉత్సవ విగ్రహంతో నగర సంకీర్తన, జోలి భిక్ష నిర్వహించనున్నారు. ఆలయంలో ఉదయం కాకడ హారతి, మంగళస్నానం, పంచామృత అభిషేకం, సామూహిక అఖండ సాయి సచ్చరిత పారా యణం, పుస్తక పూజ, మంత్ర పుష్పం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
త్రిశూల్ పహాడ్‌పై రావణ దహనానికి ఏర్పాట్లు
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్‌పహాడ్‌పై రావణాసుర ప్రతిమను దహనం చేయనున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌తో పాటు పలువురు హాజరు కానున్నారు. భక్తుల సౌకర్యార్థం త్రిశూల్‌పాహడ్‌పై విద్యుత్‌దీపాలను అలంకరించారు. రోడ్డు వెంట విద్యుత్‌లైట్లు, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని చదును చేశారు. అలాగే సౌంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయం