
సొంత ఊళ్లో జరుపుకోవడం ఇష్టం
ఆసిఫాబాద్‌అర్బన్: దసరా పండుగను సొంత ఊళ్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి జరుపుకోవ డం చెప్పలేని సంతోషంగా ఉంటుంది. కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద సాయంత్రం జమ్మిచెట్టుకు పూజ చేసి జగన్మాతను ఆహ్వానించిన తర్వాత మంగళహారతి ఇస్తారు. ఆ తర్వాత జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాం. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా దసరా మాత్రం ఇక్కడే జరుపుకుంటాం. ప్రతిఒక్కరి జీవితం విజయాలతో ముందుకు సాగాలి.
– నాగబాల సురేశ్‌కుమార్, తెలుగు టెలివిజన్
ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు