
మహిషాసురమర్ధిని అవతారంలో అమ్మవారు
రెబ్బెన: దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత బుధవారం మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో ప్రధాన అర్చకులు దేవార వినోద్‌స్వామి, ఆలయ ఆస్థాన అర్చకులు పూసాల మహేష్ శాస్త్రి ఆధ్వర్యంలో మహాచండీయాగం నిర్వహించారు. మహిషాసురమర్థిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దుర్గామాత సన్నిధిలో విశ్వప్రసాద్‌రావు
గోలేటిలో ఏర్పాటు చేసిన దుర్గామాతను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నంబాల మాజీ సర్పంచ్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రవీందర్, కిషన్‌గౌడ్, పూదరి సాయికిరణ్, పర్వతి సాయికుమార్, పస్తం పోషం, తదితరులు పాల్గొన్నారు.

మహిషాసురమర్ధిని అవతారంలో అమ్మవారు