
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కౌటాల: రైతులకు యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకట్ అన్నారు. బుధవారం కౌటాల, ముత్తంపేట్, శీర్షా గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులు, ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. అన్ని సహకార సంఘాలు, ప్రైవేట్ దుకాణాలకు యూరియా పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయాధికారుల సమక్షంలోనే యూరియా పంపిణీ చేయాలన్నారు. యూరియాతో పాటు రైతులకు ఇతర లింక్ ఎరువుల బస్తాలు కలిపి ఇవ్వకూడదన్నారు. రోజు వారీగా స్టాక్ వివరాలు నోటీస్ బోర్డులో రాయాలన్నారు. ఆయన వెంట ఏవో ప్రేమలత, డీలర్లు ఉన్నారు.