
దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
ఆసిఫాబాద్‌అర్బన్: సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని, చెడుపై మంచి సాధించిన విజ యానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా దసరా నిలుస్తుందని, షమీపూజ చేసిన ఆకును బంగారంగా తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచికంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం పండుగ ప్రత్యేకమన్నారు. దసరాను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.