
బీఆర్‌ఎస్‌లో చేరిక
ఆసిఫాబాద్: నార్నూర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివా సంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు చేయాలన్నా నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలన్నా బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో చౌహాన్ యశ్వంత్‌రావు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మర్సుకోల సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.