
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని శ్రీశ్రీ నగర్‌కు చెందిన రాసపల్లి దివ్య ఇటీవల సింగరేణి కోల్‌మైన్స్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. మంచిర్యాల డివిజన్ శ్రీరాంపూర్ ఏరియాలో జీఎం ఆఫీస్ పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న దివ్య 58 కిలోల విభాగంలో 250 కిలోల బరువు ఎత్తి పతకం అందుకుంది. డిసెంబర్‌లో నాగ్‌పూర్‌లో జరిగే కోలిండియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననుంది. దివ్యను తాజా మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, బీ స్ట్రాంగ్ జిమ్ నిర్వాహకులు గోదారి శ్రీనాథ్, జిమ్ సభ్యులు రవి, లక్ష్మీప్రసాద్ సన్మానించారు.