
పవర్ ప్లాంటులో ప్రమాదం
జైపూర్: పండుగపూట పవర్ ప్లాంటులో విషాదం నెలకొంది. రాత్రి విధులకు హాజరైన సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ గార్డుకు అదే చివరి డ్యూటీ అయింది. ఊహించని విధంగా గేటురూపంలో మృత్యువు కబ ళించింది. గేటు మూసి వేస్తున్న క్రమంలో ఊడిపో యి మీద పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కొచ్చెర్లకు చెంది న నరహరిశెట్టి అర్జున సారధి(56) జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో సీఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి డ్యూటీ కి వచ్చిన ఆయన ఎస్టీపీపీ అడ్మిన్ భవనం ప్రధాన గేటు వద్ద రాత్రి విధులు ని ర్వర్తిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4గంట ల ప్రాంతంలో వీల్స్ గేటు మూసి వేస్తున్న క్రమంలో ఊడిపోయి ప్రమాదవశాత్తు అతడిపై పడింది. కిందనలిగిపోయిన అర్జున సాఽరధిని తోటి సిబ్బంది గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుటికే ఆయన మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని సీఐఎస్‌ఎఫ్ డీఐజీ, ఐపీఎస్ డాక్టర్ ఎంజీ.రాఘవేంద్రకుమార్, ఎస్టీపీపీ సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ చంఛల్‌సర్కార్ పరిశీలించారు. మృతుడికి భార్య గంగాభవాని, కుమారుడు రాజసింహాదత్తు, కూతురు తేజసాయిశ్రీ ఉన్నారు. కేసు నమోదు దర్యాప్తున్న చేస్తున్నామని ఎస్సై శ్రీధర్ తెలిపారు.