
దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్
ఆసిఫాబాద్‌అర్బన్: దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు భగత్‌సింగ్ తన ప్రాణాలర్పించారని డీవైఎఫ్‌ఐ నాయకులు టీకానంద్, కార్తీక్ అన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 23 ఏళ్లకే ఉరికొయ్యను ముద్దాడి తన ప్రాణాలర్పించిన గొప్ప ధైర్యశాలి భగత్‌సింగ్ అని కొనియాడారు. అయితే స్వాతంత్య్ర భారతదేశంలో పేదలకు విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై యువత ప్రభుత్వంపై పోరా టానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ నిషేధం కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకుడు దుర్గం దినకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.