
దేశ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
ఆసిఫాబాద్: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మా ణం చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రచార ప్ర ముఖ్ దుర్గం పురుషోత్తం అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ జనగామ ఖండ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యసాయి సదన్‌లో విజయ దశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురుషోత్తం మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ నేడు దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందని తెలిపారు. హిందువుల్లో ఐక్యతను సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం ఒక జీవన విధానమని, విశ్వశాంతికి ఆధారమన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు బోనగిరి సతీశ్‌బాబు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.