
రేబిస్ వ్యాధి నివారణకు టీకాలు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రపంచ రేబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని పశువైద్యశాలల్లో పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచితంగా రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. జిల్లా పశువైద్యాధికారి సురేశ్ మాట్లాడుతూ పెంపుడు కుక్కలు, పిల్లులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించాలని సూచించారు. టీకాలు వేయించడం ద్వారా జంతువులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఇతరులకు వాటితో ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో 30, కాగజ్‌నగర్ డివిజన్‌లో 50 పెంపుడు జంతువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. మండల పశువైద్యాధికారులు మురళీకృష్ణ, సురేశ్, సిబ్బంది సుప్రియ, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.