
కోలిండియా పోటీల్లో సత్తా చాటాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కోలిండియా స్థాయి పోటీల్లో సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు సత్తా చాటాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇటీవల భూపాలపల్లిలో జరిగిన కంపెనీ స్థాయి పవర్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏరియాకు చెందిన మహిళా క్రీడాకారులు అనురాధ, కోట్నాక మమత, బాడీ బిల్డింగ్ పోటీల్లో మొగిలి బంగారు పతకాలు సాధించి కోలిండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను శనివారం గో లేటిలోని జీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహం, స్ఫూర్తితో కోలిండియా స్థాయి పోటీల్లోనూ రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీజీఎంలు ఎస్‌కే మదీనాబాషా, ఉజ్వల్‌కుమార్ బెహారా, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, మేనేజర్ మహేశ్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.