
చిరుత దాడిలో లేగదూడ మృతి
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలంలోని ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో శుక్రవారం చిరుతపులి దాడిలో నైతం మౌనికకు చెందిన లేగదూడ మృతి చెందింది. బాధిత రైతు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది పాదముద్రలు గుర్తించి చిరుతపులి దాడిని నిర్ధారించారు. పశువైద్యాధికారి రాకేశ్ ఆధ్వర్యంలో పంచనా మా నిర్వహించి లేగదూడను ఖననం చేశారు. బాధిత రైతుకు అటవీశాఖ నుంచి పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.