
వర్షంలోనూ బారులు
కాగజ్‌నగర్‌టౌన్/సిర్పూర్(టి): యూరియా కోసం రైతులు వర్షంలోనూ పడరాని పాట్లు పడుతున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పీఏసీ ఎస్ కార్యాలయంలో సిబ్బంది, వ్యవసాయాధి కారులు శనివారం యూరియా పంపిణీ చేశా రు. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసినా.. వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు క్యూలో నిలబడ్డారు. చినుకుల్లో తడుస్తూ బస్తాలు తీసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏఈవోలు సృజన, శ్రీనివాస్ పర్యవేక్షించారు. సిర్పూర్(టి) మండలం కేంద్రంతోపాటు లోనవెల్లిలోని రైతువేదికల వద్ద గంటలపాటు అన్నదాతలు బారులు తీరారు.

వర్షంలోనూ బారులు

వర్షంలోనూ బారులు