
ఆది కర్మయోగి
గిరిజనులకు వరంగా కార్యక్రమం జిల్లాలోని 12 మండలాల్లో 102 గ్రామాలు ఎంపిక సంక్షేమ పథకాల అమలు, సౌకర్యాల కల్పనే ధ్యేయం
అభివృద్ధి బాటకు
లింగాపూర్‌లో అవగాహన కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి అభియాన్ అమలు చేస్తోంది. జిల్లాలో మండలాల వారీ గా గ్రామాలను ఎంపిక చేసి కార్యాచరణ సిద్ధం చేశా రు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక టీంలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశా యి. వికసిత్ భారత్ సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాల కల్పనకు ఆది కర్మ యోగి అభియాన్‌ను రూపొందించింది. ఆదిమ గిరిజనులతోపాటు ఆదివాసీలు, ఇతర గిరిజనులకు అన్నిరకాల సంక్షేమ పథకాలను చేరువ చేయడం, అవగాహన కల్పించడం, సౌకర్యాలు మెరుగుపర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
102 గ్రామాల్లో అమలు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాల పరిధిలోని 102 గ్రామాల్లో ఆది కర్మ యోగి అభియాన్ అమలు కానుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో 2,356 కుటుంబాలు ఉండగా 98,991 జనాభా ఉంది. గిరిజన సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, డీఆర్డీఏ, ఐసీడీఎస్, జలశక్తి(మిషన్ భగీరథ), అటవీ శాఖ ఉద్యోగులు అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. శుక్రవారంతో అవగాహ న కార్యక్రమాలు పూర్తి కాగా అక్టోబర్ 2 నుంచి మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు తీర్మానాలు స్వీకరించనున్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక పథకాలు అమలు చేస్తున్నా గిరిజనుల దరికి చేరడం లేదు. నిరక్షరా స్యత, అవగాహన లేమితో పథకాలను వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు చేరేలా ఆది కర్మయోగి అభియాన్ కింద చర్యలు తీసుకుంటున్నారు. ఆదివాసీల ఆచార, వ్యవహార శైలి విభిన్నంగా ఉంటుంది. మైదాన ప్రాంతాల వా రితో పోలిస్తే వారికి అవగాహన తక్కువ. దీంతో అధికారులే ఆయా గ్రామాలకు వెళ్లి గిరిజనులను చైతన్యపరుస్తున్నారు. యువకులు, మహిళలకు స్థలంతో సంబంధం లేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గి రిజన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, అట వీ, తాగునీరు, మేకల పెంపకం, మునగ సాగు, అంగన్‌వాడీ, పాఠశాల భవనాలు, జీవిత బీమా, రోడ్డు రవాణా సౌకర్యాలు, ఆది సురక్ష బీమా వంటి పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గ్రామానికి అవసరమైన సౌకర్యాలపై అక్కడికక్కడే గిరిజనుల ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. విలేజ్ విజన్ –2030 ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయనున్నారు.
సౌకర్యాల కల్పనకు ఉపయోగం
గిరిజన గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ఆది కర్మ యోగి అభియాన్ ఉపయోగపడుతుంది. 12 మండలాల్లో 102 గ్రామాలను మొదటి విడతలో ఎంపిక చేశాం. ఆయా గ్రామాల నుంచి వచ్చిన తీర్మానాలను అక్టోబర్ 2న ఎంపీడీవోలు స్వీకరిస్తారు. అనంతరం జిల్లా, ఆ తర్వాత రాష్ట్రస్థాయికి పంపిస్తాం. – పి.రమాదేవి,
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
లింగాపూర్(ఆసిఫాబాద్): గిరిజన గ్రామాల అభివృద్ధే ఆది కర్మయోగి అభియాన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవితో కలిసి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అంతకు ముందు గ్రామస్తులు ఆయనకు డప్పుచప్పుళ్లతో సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడాపోటీలను పరిశీలించారు.
జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలు
మండలాలు గ్రామాలు
ఆసిఫాబాద్ 4
బెజ్జూర్ 4
చింతలమానెపల్లి 3
జైనూర్ 15
కెరమెరి 8
కౌటాల 1
లింగాపూర్ 9
రెబ్బెన 1
సిర్పూర్(యూ) 14
తిర్యాణి 31
వాంకిడి 8
కాగజ్‌నగర్ 4

ఆది కర్మయోగి