
పర్యావరణ పరిరక్షణకు కృషి
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నా రు. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభ్రమైన గాలి, ఆరోగ్యవంతమైన ప్రజలు అనే నినాదంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సమతుల్య వాతావరణాన్ని సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో పర్యావరణ విద్య అంబాసిడర్, జాతీయ హరితదళం జిల్లా సమన్వయకర్త మధుకర్, మెప్మా అధికారి మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు.