ప్రాణాలపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలపై పట్టింపేది?

Sep 27 2025 4:55 AM | Updated on Sep 27 2025 4:55 AM

ప్రాణాలపై పట్టింపేది?

ప్రాణాలపై పట్టింపేది?

● అదే ఏడాది సెప్టెంబర్‌ 8న లక్మాపూర్‌ గ్రామానికి చెందిన మాలోత్‌ లక్ష్మణ్‌ అనే రైతు పత్తి పంటకు క్రిమిసంహాకరక మందు పిచికారీ చేస్తుండగా స్పృహతప్పి పడిపోయాడు. కెరమెరి ఆస్పత్రికి తరలించేందుకు మార్గమధ్యలోని వాగుతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. వరద ఎక్కువగా ఉండటంతో ఐదుగురు కలిసి రైతును మంచంపై పడుకోబెట్టి వాగు దాటించారు. సెప్టెంబర్‌ 23న బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి జాదవ్‌ అశ్విని వైద్యపరీక్షల కోసం ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. అనార్‌పల్లి వాగు ఉధృతి తగ్గకపోవడంతో గర్భిణిని కొందరు చేతులపై మోస్తూ ఒడ్డుకు చేర్చారు. సెప్టెంబర్‌ 30న బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన ఆడే నాందేవ్‌ అస్వస్థతకు గురైయ్యాడు. ఆరుగురు కుటుంబ సభ్యులు డోలిపై పడుకోబెట్టి వాగు దాటించారు. అక్కడి నుంచి జీపులో కెరమెరి పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం మళ్లీ అదే రీతిలో వాగు దాటించి ఇంటి వచ్చారు. ● ఈ ఏడాది సైతం వాగులు ఉప్పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 21న అనారోగ్యంతో బాధపడుతున్న కరంజీవాడ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మందాడి కోసును కొందరు చేతులపై ఎత్తుకుని వాగు దాటించారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే వరదతో నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉండటం, ఆరోగ్యం విషమించిన తర్వాత ఆస్పత్రికి రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. జనకాపూర్‌ గ్రామానికి చెందిన పవార్‌ బిక్కునాయక్‌(78)కు ఈ నెల 25న చాతీలో నొప్పి వచ్చింది. వరద కారణంగా ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. శుక్రవారం ఉదయం మళ్లీ నొప్పరావడంతో ప్రమాదకరంగా కుటుంబ సభ్యులు వాగు దాటిస్తుండగా బిక్కునాయక్‌ మృతి చెందాడు.

వాగులు ఉప్పొంగి గ్రామాలకు రాకపోకలు బంద్‌ ఆస్పత్రులకు చేరుకునేందుకు అష్టకష్టాలు అనార్‌పల్లి వాగు వద్ద శుక్రవారం మరొకరు మృతి

కెరమెరి(ఆసిఫాబాద్‌): జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వా రు కరువయ్యారు. అసంపూర్తి వంతెనలు పూర్తి చేయడంతోపాటు లోలెవల్‌ వంతెన వద్ద హైలెవల్‌ బ్రిడ్జీలు నిర్మించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కెరమెరి మండలం అనార్‌పల్లి వాగు ఉప్పొంగి సకాలంలో ఆస్పత్రికి చేరుకోకపోవడంతో శుక్రవారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్‌ మండలంలో గుండి వాగు, కెరమెరి మండలంలో లక్మాపూర్‌, అనార్‌పల్లి, చింతలమానెపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రజలు అత్యవసర సమయంలో ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు.

అసంపూర్తిగా వంతెనలు..

కెరమెరి మండలంలోని లక్మాపూర్‌ వాగుపై వంతెన రూ.3కోట్ల అంచనా వ్యయంతో 2016లో ప్రారంభమై 2017లో పూర్తి కావాల్సి ఉంది. కానీ పిల్లర్లు నిర్మించి వదిలేశారు. ముగ్గురు కాంట్రాక్టర్లు మారినా పనులు ముందుకు సాగడం లేదు. అలాగే అనార్‌పల్లి వాగుపై రూ.5కోట్ల అంచనా వ్యయంతో 2016లో పనులు ప్రారంభమై 2018 నాటికి పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. కరంజీవాడ, బోరిలాల్‌గూడ, జనకాపూర్‌ తదితర గ్రామాల ప్రజలు అనార్‌పల్లి వాగు దాటితేనే కెరమెరి మండల కేంద్రానికి చేరుకుంటారు. వాగులో వరద పెరిగితే వారు బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సిందే..

వాగు దాటేందుకు ప్రాణాలు పణం

లక్మాపూర్‌, అనార్‌పల్లి వాగులు దాటేందుకు ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. 2023 సెప్టెంబర్‌ 6న అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను గ్రామస్తులు ఒంటి చేతులపై ఎత్తుకుని వాగు దాటించడం అప్పట్లో బాహుబలి సినిమాను తలపించింది.

అనార్‌పల్లి వాగు దాటుతున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement