
రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రైజింగ్– 2047 పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల కళ్లకు కట్టే విధంగా ప్రగతి నివేదికలు రూపొందించామ ని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీలు గోరంత పనిచేసి, సోషల్ మీడియాలో కొండంత ప్రచా రం చేసుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మండల అధ్యక్షుడు చరణ్, నాయకులు రమేశ్, మునీర్, శివప్రసాద్, బలరాంనాయక్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి రూ.15కోట్లు
ఆసిఫాబాద్: నూతన ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.