
టెండర్లకు రెడీ
నూతన ఎకై ్సజ్ పాలసీ గెజిట్ విడుదల నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 11 దుకాణాలకు రిజర్వేషన్, మరో 21 జనరల్ అక్టోబర్ 23న లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయింపు
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: నూతన ఎకై ్సజ్ పాలసీ(2025– 27) గెజిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో మాదిరిగానే జిల్లాలో 32 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో గురువారం లక్కీడ్రా ద్వారా షాపులు ఖరారు చేశారు. రిజర్వేష న్ ప్రాతిపదికన గౌడ కులస్తులకు రెండు, ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒక షాపు కేటాయించగా, ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు నాలుగు షాపులు కేటా యించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నం.1, 4, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని నం.1, సిర్పూర్(టి) మండల కేంద్రంలోని షాపును ఎస్సీలకు కేటాయించగా, రెబ్బెన మండలం గోలే టి, బెజ్జూర్ మండల కేంద్రంలోని షాపును గౌడ కులస్తులు, కౌటాల మండల కేంద్రంలోని షాపును ఎస్టీలకు లక్కీడ్రా పద్ధతిన ఖరారు చేశారు. అలాగే గత ఎకై ్సజ్ పాలసీలో ఆదాయం రాని వైన్స్‌లను మరోచోటుకు తరలించారు. సిర్పూర్(టి) మండలం లోనవెల్లిలోని దుకాణాన్ని చింతలమానెపల్లికి, సిర్పూర్(యూ) మండలం రాగాపూర్ దుకాణాన్ని సిర్పూర్(యూ)కు, లింగాపూర్ షాపును జైనూర్‌కు మార్చారు. ఇక జనరల్ కేటగిరీలో 21 దుకాణాలు ఉన్నాయి. రిజర్వేషన్ ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు ఆధార్, పాన్‌కార్డు, మూడు పాస్‌ఫొటోలు జత చేస్తే సరిపోతుంది.
నేడు నోటిఫికేషన్
ఎకై ్సజ్ నూతన పాలసీలో భాగంగా శుక్రవారం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. 21 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎన్ని దుకాణాలైనా పొందవచ్చు. ఆదివారాలు మినహాయించి అన్ని పనిదినాల్లో అక్టోబర్ 18 వరకు జిల్లా కేంద్రంలోని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అందించవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఆ రోజు దరఖాస్తుదారులు ఉదయం 9 హాజరుకావాలని అధికారులు సూచించారు. దరఖాస్తుదారులు రాని పక్షంలో ఆథరైజేషన్ పొందిన వ్యక్తులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. టెండర్‌లో దుకాణం పొందిన వ్యక్తి ఆరు విడతల్లో ట్యాక్స్ చెల్లించాలి. అలాగే వారు 25 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా చూపించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి.
పెరిగిన రుసుం
గతంలో మద్యం దుకాణం దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. 2021లో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లావ్యాప్తంగా 26 దుకాణాలకు 763 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.15.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో నిర్వహించిన టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 1020 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.20.40 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటం, దరఖాస్తు రుసుం సైతం పెంచడంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది మద్యం టెండర్లలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయింపు
2025– 27 సంవత్సరానికి రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ కులస్తులకు 4, ఎస్టీలకు 1, గౌడ కులస్తులకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. గురువారం కలెక్టరేట్ చాంబర్‌లో లక్కీ డ్రా పద్ధతిన రిజర్వేషన్ దుకాణాలు ఖరారు చేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 23న కలెక్టరేట్‌లో లక్కీడ్రా పద్ధతిన దుకాణాల కేటాయింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతి కిరణ్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.