
దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నివాళి
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన అంత్యోదయ, ఏకాత్మక మానవ వాదం నినాదాల స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ద్వారా విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు బండి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, పెద్ద హరీశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.