
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఉండొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని వైల్డ్‌లైఫ్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు విద్యుత్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో గురువారం విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో విద్యుత్ వైర్లు అమర్చొద్దన్నారు. రిజర్వ్ ఫారెస్టులోని విద్యుత్ లైన్లను తొలగించి రెవెన్యూ భూముల నుంచి వేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు, సీఐలు రాణాప్రతాప్, మూసావీర్, సద్దాం, విద్యుత్ శాఖ ఈఈ శేషారావు, ఏడీఈ రాజేశ్వర్, ఏఈ ఇర్ఫాన్ అహ్మద్, ఏఈ అంజల్ తదితరులు పాల్గొన్నారు.