
డీలర్ల లైసెన్స్‌లు రద్దు
కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూరియా అమ్మకాలు సాగిస్తున్నారని ఈ నెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అర్ధరాత్రి అమ్మకాలు’ అనే కథనానికి వ్యవసాయశాఖ అధికారులు స్పందించారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో వ్యవసాయ అధికారుల అనుమతులు లేకుండా అర్ధరాత్రి అక్రమంగా యూరియా పంపిణీ చేసిన డీలర్ల లైసెన్సులు రద్దు చేసినట్లు ఏడీఏ మనోహర్ గురువారం వెల్లడించారు. కౌటాల మండలంలోని శీర్షా గ్రామానికి చెందిన కొండయ్య ట్రేడర్స్, శ్రీ ఆంజనేయ ట్రేడ ర్స్, సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నానికి చెందిన శ్రీనివాస్ ఫర్టిలైజర్స్ షా పు డీలర్లు అర్ధరాత్రి సమయంలో యూరియా పంపిణీ చేశారని వ్యవసాయ అధికారుల విచా రణలో రుజువైందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వారి లైసెన్సులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. డీలర్లు యూరియా, ఎరువులను వ్యవసాయాధికారుల సమక్షంలో పంపిణీ చేయాలని, అధికారులకు సమాచారం ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎఫెక్ట్