
ఏరియా ఉద్యోగులకు బంగారు పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సింగరేణి కంపెనీ లెవల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఏరియాకు చెందిన అనురాధ 57కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా, కోటంక మమత 47కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు. సింగరేణి కంపెనీ లెవల్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వీరు కోల్ ఇండియా లెవల్ పోటీలకు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించిన ఏరియా క్రీడాకారులు అక్టోబర్ 14 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జరి గే కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులను ఏరి యా అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.