
పండుగ అడ్వాన్స్ చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎన్‌హెచ్‌ఎం స్కీంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగుల మాదిరి డైస్, రేడియోగ్రాఫర్లకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించా లని బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూని యన్ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం రూ.20వేలను దసరా అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరా రు. పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి శ్రమిస్తూ ఎన్‌హెచ్‌ఎం సంస్థ అభివృద్ధికి తోడ్పాడుతున్న వారిని విస్మరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నగేశ్, ప్రవీణ్, షకీల్, జీవిత తదితరులు పాల్గొన్నారు.