
‘రైతులకు తీవ్ర అన్యాయం’
బెజ్జూర్: బీజేపీ నాయకులు తమ గోదాములకు యూరియా తరలించి తీవ్ర అన్యాయం చేశారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.270కు లభించాల్సిన యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో రూ.వెయ్యికి దొరుకుతుందని తెలిపారు. దిందా పోడు రైతుల బాధ్యతను ఎమ్మెల్యే హరీశ్‌బాబు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అర్షద్ హుస్సేన్, సారయ్య, తిరుపతి, ఇస్తారీ, ఖాజా మోయినొద్దీన్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
‘అజీమ్ ప్రేమ్‌జీ’ స్కాలర్‌షిప్‌పై అవగాహన
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో విద్యార్థులకు బుధవారం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న స్కాలర్‌షిప్ లపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ స్కాలర్‌షిప్‌నకు దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ చదివి పాసై, ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో చదువుతున్న వారు అర్హులని తెలిపారు. ఎంపికై నవారికి ఏటా రూ.30వేల చొప్పు న సాయం అందిస్తారని అన్నారు. శ్యామ్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.