
గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి
ఇంద్రవెల్లి: గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని పరిశీలించారు. మంచి పోషకాహారం, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న గుడ్లు, పాలు తీసుకోవాలని గర్భిణులకు సూచించారు. ఆస్పత్రిలో శుద్ధ జల సమస్య ఉందని సిబ్బంది పీవో దృష్టికి తీసుకెళ్లగా ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్, పూజిత, శ్వేత, సిద్ధార్థ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.