
దేశీదారు పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: అక్రమంగా మహరాష్ట్ర నుంచి జిల్లాకు దేశీదారు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పెన్‌గంగా నది ఒడ్డున పెండల్‌వాడ గ్రామ శివారులో రూ.30వేల విలువైన 404 దేశీదారు బాటిళ్లను పట్టుకున్నారు. పెండల్‌వాడ గ్రామానికి చెందిన అడిగే రమేష్, టార్పే వినోద్, పద్రె గజానంద్ దేశీదారు తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దేశీదారు అక్రమ రవాణా చేసినా, విక్రయాలు జరిపినా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.